మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ తన ఇమేజీకి తగ్గట్లుగా.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. కాగా ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న వార్త ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని. ఇటు తండ్రిపాత్రలోనూ.. అలాగే అటు కొడుకు పాత్రలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెగ రూమర్స్ వచ్చాయి.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ లో నటించట్లేదని.. ఎన్టీఆర్ కేవలం కొడుకు పాత్రలో మాత్రమే నటిస్తున్నారు తప్ప.. తండ్రి పాత్రలో నటించట్లేదని స్పష్టం చేశారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
