అల్లు అర్జున్ వైఫ్ రికార్డ్ !

Alluarjun

అల్లు అర్జున్‌ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు హీరోలందరిలో.. ఇంకా మాట్లాడుకుంటే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరి కంటే.. అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. కేరళలో కూడా బన్నికి ఫ్యాన్ గ్రూప్స్ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు బన్నికే కాకుండా ఆయన భార్య స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ఏర్పడటం విశేషం.

స్నేహారెడ్డికి ఇన్‌ స్టాగ్రాంలో వన్ మిలియన్ ఫాలోవర్స్ చేరారు. ఇలా వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోల భార్యల లిస్ట్ లో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్, తాజాగా స్నేహారెడ్డినే ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన హీరో సతీమణి ఫాలోయింగ్ పై తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Exit mobile version