దృశ్యం డైరెక్టర్ తో కార్తీ ?

Karthi

‘కడై కుట్టి సింగం’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న తమిళ హీరో కార్తీ ప్రస్తుతం ‘దేవ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈచిత్రం సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు ఆయన తాజాగా మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మలయాళంలో ‘దృశ్యం’ అనే బ్లాక్ బ్లాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెప్ చెప్పిన కథ కార్తీ కి నచ్చడంతో వెంటనే సినిమాకు ఒకే చెప్పాడట. ఈచిత్రాన్ని కార్తీ అన్నయ్య స్టార్ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటెర్టైన్మెంట్స్ మరియు వయాకామ్ 18 సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయట.

ఒకవేళ ఈ వార్తలు నిజమైతే జీతూ జోసెఫ్ కు తమిళంలో ఇది రెండవ సినిమా అవుతుంది. ఇంతకుముందు ఆయన అక్కడ కమల్ హాసన్ తో ‘దృశ్యం’ ను పాపనాశం పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. ఇక ఈచిత్రం తెలుగులో ‘దృశ్యం’ పేరుతో రీమేక్ అయ్యింది. ఈచిత్రంలో విక్టరీ వెంకటేష్ , మీనా జంటగా నటించారు.

Exit mobile version