ట్రైలర్ తో అంచనాలు పెంచుతున్న ఎనర్జిటిక్ హీరో !

Hello Guru Prema Kosame

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో రామ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసుకొని వస్తోన్న ఈ చిత్రం.. ట్రైలర్ లో కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలనే ఎక్కువుగా చూపించారు.

కాగా మంచి లవ్ సబ్జెక్ట్ తో ఎంటర్ టైనర్ గా సాగనున్న ఈ చిత్రంలో రామ్ కొత్తగా కనిపించనున్నారని.. తన కామెడీ టైమింగ్ దగ్గర నుంచి, తన మాడ్యులేషన్ వరకు ఎంతో కేర్ తీసుకోని మరి ఈ చిత్రంలో రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఎంటర్టైనర్ ను దసరా కానుకగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version