తిత్లీ బాధితుల‌కు ‘జీవితా రాజశేఖర్’ 10 లక్షలు విరాళం !

‘తిత్లీ’ బీభత్సం కారణంగా సిక్కోలులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. వారి బాధకి తెలుగు సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. తాజాగా జీవితా రాజశేఖర్ రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించి తిత్లీ బాధితుల‌కు అండగా నిలబడ్డారు. అమరావతిలోని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుగారిని కలిసి చెక్ ని అందజేశారు.

కాగా ఇప్పటి వరకు సినీ రంగం నుండి నందమూరి బాలకృష్ణ 25 లక్షలు, ఎన్టీఆర్ రూ.15 లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.లక్ష, కొరటాల శివ రూ.3 లక్షలను తిత్లీ బాధితుల‌కు సహాయార్ధం కొరకు విరాళాలు ప్రకటించి.. సిక్కోలులోని ప్రజలకు కష్టకాలంలో తోడుగా నిలబడ్డారు.

Exit mobile version