రామ్ హీరోగా, దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీతో మరియు మంచి ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ పరంగా కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. దాంతో ప్రస్తుతం చిత్రబృందం సక్సెస్ టూర్ కూడా నిర్వహిస్తోంది.
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర హీరో రామ్ మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోమని.. మా ఇంట్లో గోల చేస్తున్నారు. ఎప్పుడూ సినిమాలేనా.. లైఫ్ అంతా సినిమా గోలేనా. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావని పదే పదే అడుగుతున్నారు. ఆ టైంలో నాకేం వినపడనట్లు నటిస్తున్నాను (నవ్వుతూ).. పెళ్లి గురుంచి వచ్చినప్పుడల్లా, తర్వాత సినిమా అయిపోయాక చేసుకుంటా అని ఎప్పటికప్పుడు పెళ్లి దాటవేస్తున్నా.. అని తెలిపారు.
