తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 36వ చిత్రం ‘ఎన్జీకే’ అప్ డేట్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి చిత్ర టైటిల్ పోస్టర్ తప్ప ఇంతవరకు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయకపోవడంతో కనీసం ఈ దీపావళికి అయినా ఏదో ఒక అప్డేట్ ను రివీల్ చేయాలని సూర్య ఫ్యాన్స్ చిత్ర యూనిట్ ను కోరుతున్నారు. మరి వారి కోరిక మేరకైనా ఈ దీపావళి రోజు ఈచిత్రం నుండి అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.
ఇక ఈ చిత్రం యొక్క ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెలలో జరుగనుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్నా ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి లు కథానాయికలుగా నటిస్తున్నారు.
