తల అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వాసం’ విడుదలకు సిద్ద మవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యాక్రమాలను ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. దాంట్లో భాగంగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ను డిసెంబర్ 13న విడుదల చేయనున్నారట. అజిత్ ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకొని ప్రముఖ రచయిత వివేక్ రచించిన ఈ సాంగ్ పూర్తిగా మాస్ బీట్ తో ఉండనుందని తెలుస్తుంది. శివ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది.
ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నిసత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదలకానుంది. ఇక ‘వీరం, వేదాలం , వివేగం’ తరువాత అజిత్ , శివ కలయికలో వస్తున్న ఈచిత్రంఫై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
