హార్ట్ బ్రేక్ సాంగ్ తో వచ్చిన మిస్టర్ మజ్ను !

nalo neeku1

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. కాగా ఈ చిత్రం నుండి ఈ రోజు సాయంత్రం ‘నాలో నీకూ, నీలో నాకు సెలెవేనా’ అనే లిరిక్ వీడియో సాంగ్ విడుదల అయింది. ఈ పాటను గీత రచయిత శ్రీమణి రాయగా.. సింగర్స్ శ్రేయ ఘోషాల్, కాలా భైరవ పాడారు. ఇక తమన్ తన సంగీతంతో ఈ పాటను వినసొంపుగా తీర్చిదిద్దారు.

ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

లిరిక్ వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version