‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్ ఈ రోజుతో పూర్తి అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈచిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
ఇక ‘అఖిల్ ,హలో’ చిత్రాలతో పూర్తి స్థాయిలో విజయాలు అందుకోవడం లో విఫలమైన అఖిల్ ఈ చిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం తోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. కాగా త్వరలోనే అఖిల్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నాడు.
