ఎన్టీఆర్ గారే మళ్ళీ వచ్చి చేశారా !

NBK
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘కథానాయకుడు’ని చూసి బాలయ్య అద్భుతంగా నటించారని, ఎన్టీఆర్ పాత్రలో ఆయన జీవించనట్లు ఉందని.. అలాగే దర్శకుడు క్రిష్ కూడా సినిమాని బాగా తెరకెక్కించారని అభినందిస్తున్నారు.

కాగా నిన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కథానాయకుడుని బాలయ్య, క్రిష్ తో కలిసి చూశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది. మొదట బాలకృష్ణ ఎన్టీఆర్ గారి పాత్రను చేయగలడో లేదో అని నాకు చిన్న అనుమానం ఉంది. కానీ ఇప్పుడు సినిమా చూశాక ఎన్టీఆర్ గారి పాత్రను బాలకృష్ణ తప్ప ఇంకెవరూ చేయలేరనిపించింది. నాకైతే ఎన్టీఆర్ గారే మళ్ళీ వచ్చి చేశారా అనిపిస్తోంది. ఇక నా పాత్రను కూడా క్రిష్ చాలా బాగా తెరకెక్కించారు అని బాబు తెలిపారు.

Exit mobile version