ఎన్టీఆర్ కథానాయకుడు లో వైస్ పాత్రలో కనిపించిన నటుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కూడా !

NTR4

ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఇటీవల మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో దివగంత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో నటిస్తున్నాడు.

విచిత్రం ఏమిటంటే ఈ చిత్రంలో అయన చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రంలో దేవినేని నెహ్రు పాత్రలో నటించాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ లక్ష్మిస్ ఎన్టీఆర్ లో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన యజ్ఞ శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది.

Exit mobile version