సూర్య టీజర్ కు డబ్బింగ్ చెప్పేశాడు !

Surya

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘ఎన్ జి కె’ చిత్రం యొక్క టీజర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ టీజర్ కి సూర్య డబ్బింగ్ చెప్పేశాడు. ఈ టీజర్ ను ఫిబ్రవరి 14న విడుదలచేయనున్నారు. షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఈ సమ్మర్ లో విడుదలకానుంది.

Exit mobile version