‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క.. ఆ తరువాత చాలా రోజులు విరామం తీసుకుని ‘సైలెన్స్’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రల్లో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం.
కాగా అమెరికాలో తన వెయిట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంది అనుష్క. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో ఎవరితోనే దిగిన ఫోటోను అనుష్క పోస్ట్ చేసింది. కాగా అనుష్క పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అని నెటిజన్లు బాగా ఆసక్తి చూపించారు.
తాజా సమాచారం ప్రకారం అనుష్క పక్కన ఉన్న ఆ వ్యక్తి ఆస్ట్రియాకు చెందిన తన హెల్త్ ట్రైనర్ ‘ల్యూక్ కౌంటింహో’ అట. అనుష్క చెయ్యబోతున్న సైలెన్స్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నుండి షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
