మజిలీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథులు గా సీనియర్ హీరోలు !

majili 123

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజిలీ మరో వారంలో ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 31న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హల్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సీనియర్ అగ్ర హీరోలు విక్టరీ వెంకటేష్ , కింగ్ నాగార్జున హాజరుకానున్నారు.

నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ పాత్రలో కనిపించనుండగా హిందీ నటి దివ్యంక కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. టీజర్ , సాంగ్స్ ద్వారా ఇప్పటికే ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version