వరస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీగా వున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల ‘ఎన్ జి కె’ చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘కాప్పాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం కూడా తుది దశకు చేరుకుంది. ఆగస్టు 30న ఈ చిత్రం విడుదలకానుంది.
ఇక ఈ చిత్రాల తరువాత సూర్య ‘గురు’ ఫేమ్ సుధా కొంగర తో ఒక సినిమా చేయనున్నాడు. వచ్చే నెల నుండి ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నాడు. సూర్య కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను రెడీ చేశారట లేడీ డైరెక్టర్ సుధా కొంగరా. అన్ని కుదిరితే ఈ చిత్రం కూడా ఈఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.
