అగ్ర దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణం లో ఆకాశవాణి అనే చిత్రం రూపొందుతుంది. కేవలం 5కోట్లబడ్జెట్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ఆయనకు ఇదే మొదటిసినిమా. ఇక ఈ సినిమాతో పాటు ఈ విలక్షణ నటుడు ఆర్ఆర్ఆర్ లో కూడా నటించనున్నాడు.
నూతన దర్శకుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దాదాపుగా అందరు కొత్త వారే నటిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల బైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
