తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ పొంగల్ కానుకగా విడుదలై కోలీవుడ్ లో 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. శివ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నయన తార కథానాయికగా నటించగా జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రం ఇటీవల సన్ టీవీలో ప్రసారం కాగా అత్యధికంగా 18.1 మిలియన్ వ్యూయర్ షిప్ ను రాబట్టుకొని కొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.
అజిత్ కు కోలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్నందున ఈ రికార్డు సాధ్యమైంది. అయితే ఈచిత్రం అదే టైటిల్ తో తెలుగులోనూ విడుదలకాగా మినిమం కలెక్షన్స్ ను కూడా రాబట్టుకోలేకపోయింది.
