చిరంజీవికి జీవితంలో తీరని లోటు అదొక్కటే.

Chiranjeevi1

మహానటుడు ఎస్వీ రంగారావు నటప్రస్థానంపై రచయిత సంజయ్ కిషోర్ ‘మహానటుడు’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగా స్టార్ చిరంజీవి తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సంధర్బంగా చిరంజీవి ఎస్వీ రంగారావు గురించి మాట్లాడుతూ, భావోద్వేగాలకు లోనయ్యారు. తనకు నటుడు అవ్వాలన్న ప్రేరరణ వెనుక కారణం ఎస్వీఆర్ కారణంగానే అని చెప్పారు.

ఎస్వీఆర్ నటించిన జగత్ కిలాడీలు, జగజ్జంత్రీలు చిత్రాల్లో తన తండ్రి చిన్న పాత్రలు పోషించారని, ఆ సమయంలో ఎస్వీఆర్ గురించి ఇంటి వద్ద తన తండ్రి చెబుతుంటే ఆసక్తిగా వినేవాడ్నని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. నటుడిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక బలపడింది అప్పుడేనని తెలిపారు. అయితే, తన ఆరాధ్యనటుడైన ఎస్వీ రంగారావు గారిని తన జీవితంలో ఎన్నడూ కలవలేకపోవడం తీరనిలోటుగా మిగిలిపోయిందని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. కనీసం ఆయన్ని ప్రత్యక్షంగా కూడా చూడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో తాను కోల్పోయింది, లోటుగా భావించేది ఏదైనా ఉందంటే అది ఎస్వీఆర్ ను కలవలేకపోవడమేనని తెలిపారు.

Exit mobile version