నటి విజయనిర్మల సంతాప సభలో అపశృతి.

vijayanirmala

నటి దర్శకనిర్మాత విజయనిర్మల గత నెల 27న హఠాన్మరణం పొందిన విషయం విదితమే. ఆమె కన్నుమూసి 10రోజులైన సంధర్బంగా కుటుంబ సభ్యులు నేడు ఉదయం హైదరాబాద్‌లోని సంధ్య కన్వెషనల్‌ సెంటర్‌లో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీప్రముఖులు, అభిమానులు హాజరుకానున్న తరుణంలో వారి సౌకర్యార్ధం భారీగా ఏర్పాట్లు చేశారు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశత్తూ ఆసమయంలో టెంట్ క్రింద ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version