అవును ఆయన నా చిత్రం నుండి వెళ్లిపోయారు.

Ajay bhupati

దర్శకుడు అజయ్ భూపతి కొద్దిరోజుల క్రితం ఒక సంచల ట్వీట్ తో వార్తలలో నిలిచారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన చీప్ స్టార్ అని ఒక పదం ట్వీట్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ఐతే త్వరలో ఆయన తెరకెక్కించనున్న మహాసముద్రం సినిమా విషయంలో హీరో రవి తేజకి తనకు మధ్య జరిగిన వ్యవహారం గురించి అడుగగా అజయ్ భూపతి స్పందించారు. అవును రవి తేజ మహా సముద్రం చేయడం లేదు, నేను వేరే హీరోని వెతికే పనిలో ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ ఈ విషయంపైన మాట్లాడను అని ఆయన అన్నారు.

వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో హీరో సిద్దార్ధ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో నాగ చైతన్య చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

Exit mobile version