‘వాల్మీకి’కి ఇలా జరగటం దురదృష్టకరమన్న విజయ్ దేవరకొండ

‘వాల్మీకి’ సినిమా టైటిల్ విషయమై బోయ సామాజిక వర్గం నేతలు చాలా రోజుల నుండి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. చివరికి కోర్టు నోటీసులు కూడా పంపారు. దాంతో దర్శక నిర్మాతలు టైటిల్ మారచక తప్పలేదు. ‘వాల్మీకి’ పేరును ‘గద్దలకొండ గణేష్’ అని మర్చారు. ఇలా విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చవలసి రాబడంతో హరీశ్ శంకర్ చాలా డిస్టర్బ్ అయ్యారు.

చాలమంది సినీ జనం ఇది సరికాదని అంటుండగా హీరో విజయ్ దేవరకొండ సైతం అలానే అభిప్రాయపడ్డారు. ఇలా పేరు మార్చవలసి రావడం దురదృష్టకరమన్న విజయ్.. పేరు మార్చినా థియేటర్లు నిండిపోతాయని, ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని అంటూ దర్శకుడు హరీశ్ శంకర్,
నటీనటులు వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళికి తన మద్దతును, శుభాకాంక్షలను తెలిపాడు.

Exit mobile version