బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ‘చాణక్య’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాకిస్తానీ అమ్మాయిగా కనిపించనుంది. పైగా సినిమాలోని కీలకమైన సన్నివేశాలు ఆమె చుట్టే తిరుగుతాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి, జరీన్ ఖాన్ టాలీవుడ్ లో నిలబడటానికి ‘చాణక్య’ ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి. ఇక జరీన్ ఖాన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తానూ తెలుగు సినిమా గురించి చాల గొప్పగా విన్నానని, తన తొలి చిత్రం ‘చాణక్య’ పై చాలా ఆశలు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. మరి జరీన్ ఖాన్ ఆశలు నెరవేరాలని కోరుకుందాం.
ఇక యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయని అలాగే ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
