హీరోయిన్ ఉగ్గులా పెగ్గు పట్టిస్తుంది

90ml3

ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటి హిట్ అందుకున్న కర్తకేయ యూత్ ఫుల్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇటీవల గుణ 369 చిత్రంతో అలరించిన ఈ కుర్రాడు తాజాగా విలన్ పాత్రలను ఒప్పుకుని, నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో చక్కని నటనను కనబరిచాడు. కాగా 90ఎంఎల్ అనే మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రానున్నాడు.

ఇప్పటికే భిన్నమైన పోస్టర్స్ విడుదల చేసిన చిత్ర బృందం నేడు కార్తికేయ హీరోయిన్ ఒడిలో పడుకుంటే ఆమె పాలపీకతో మందు తాగించడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి ట్రెండీ పోస్టర్స్ తో చిత్రంపై హైప్ పెంచేస్తున్నారు.కార్తికేయ క్రియేటివ్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అలీ, పోసాని,రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version