యువతను ఊపేస్తున్న సిద్ధ్ శ్రీరామ్ బ్యాక్ గ్రౌండ్…!

id

“ఇంకేం ఇంకేం కావాలే…,చాలే ఇది చాలే…” “అందం అమ్మాయైతే నీలా ఉందా..,అన్నట్టుండే…” ఇలా పాటేదైనా ఆయన గాత్రం వింటే చాలు యువత వెర్రెత్తిపోతారు. మోస్ట్ పాప్యులర్ సింగర్ గా ముఖ్యంగా సౌత్ లో దూసుకుపోతున్నారు సిద్ శ్రీరామ్. వైవిధ్యమైన గళం, వినసొంపైన గానం అతనికి ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఇక రెండు రోజుల క్రితం అలవైకుంఠపురంలో ఆయన పాడిన సాంగ్ సూపర్ సక్సెస్ సాధించింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ మరియు లైక్స్ దక్కించుకుంటుంది. మరి ఇంతగా యువత మనసు దోచుకున్న ఈ సింగర్ ఎవరయ్యా అంటే…?

సిద్ శ్రీరామ్ పుట్టింది చెన్నైలోనైనా పెరిగింది మాత్రం కాలిఫోర్నియాలో. ఆయన ఒక ఏడాది బాలుడిగా ఉన్నప్పుడే వారి కుటుంబం కాలిఫోర్నియా వెళ్లిపోవడం జరిగింది. కర్ణాటక సంగీత టీచర్ అయిన తల్లి లతా శ్రీరామ్ సిద్ శ్రీరామ్ మొదటి గురువు. బర్కీలీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ అందుకున్న సిద్, అప్పుడప్పుడు ఇండియా లో మ్యూజిక్ కాన్సర్ట్స్ లో పాల్గొనేవాడు.

ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కడలి చిత్రంలో మొదటిసారి సిద్ శ్రీరామ్ చేత ఓ పాట పాడించారు. అలాగే ఐ,24 చిత్రాలలో సిద్ పాడిన పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి. తెలుగులో గీతగోవిందం, టాక్సీవాలా చిత్రాలలోని పాటలు యూత్ కి బాగా దగ్గరయ్యాయి. ఇంత వినసొంపుగా పాడే సిద్ శ్రీరామ్ కి తెలుగు తమిళ భాషలు అస్సలు రాకపోవడం గమనార్హం.

Exit mobile version