పవన్ కళ్యాణ్ సినిమా కొత్త రికార్డ్ !

Agnyaathavaasi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ.. ‘అజ్ఞాతవాసి’ మాత్రం ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎప్పుడో విడుదలైన సినిమా ఇప్పుడు రికార్డ్ లు సృష్టించడం ఏమిటి అనుకుంటున్నారా ? ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని హిందీ భాషలోకి డబ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా ‘అజ్ఞాతవాసి’ హిందీ వెర్షన్ గత ఏడాది అక్టోబర్‌ లో యూట్యూబ్‌ లో పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్రం 100 మిలియన్ల వ్యూస్ ను సాధించి సరి కొత్త రికార్డ్ ని నెలకొల్పింది. టాలీవుడ్ చిత్రాల ప్రముఖ డిజిటల్ పంపిణీదారు అయిన గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ లో 4.6 లక్షలకు పైగా లైక్‌ లు ‘అజ్ఞాతవాసి’ హిందీ వెర్షన్ కి వచ్చాయి. లైక్ లతో పాటు 100 మిలియన్ వ్యూస్ రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Exit mobile version