టీజర్ లాంచ్ లో డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్ !

meena bazaar

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్., టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది. హీరో మధు సుధన్, హీరోయిన్ శ్రీజిత ఘోష్, నిర్మాతలు సి.కళ్యాణ్, రామసత్యనారాయణ ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. మీడియా మిత్రులు స్టిల్ ఫోటోగ్రఫర్స్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. మీనా బజార్., చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర సభ్యులు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతు.. మీనా బజార్., టీజర్ బాగుంది. ఈ చిత్రం మంచి సక్సెస్ అయ్యి పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మంచి చిత్రాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మీనా బజార్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ చిత్ర టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది వీరు ఎంత గ్రాండ్ గా సినిమా తీశారో. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తప్పకుండా ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం సహజమే. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు. హీరో మధుసూదన్ మాట్లాడుతూ… మన చుట్టూ జరిగే సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ కు కనెక్ట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ సింగ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

Exit mobile version