ప్రీమియర్స్ లో సత్తా చాటిన సైరా మూవీ

Syeraa1

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఐదు భాషలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. మూవీ పై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా సైరా సత్తా చాటింది.

రాత్రి 10:30 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 269 లొకేషన్స్ నుండి సైరా $7,39,136 డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ ట్రెండ్ కొనసాగితే కేవలం ప్రీమియర్స్ ద్వారానే సైరా వన్ మిలియన్ మార్కు చేరుకునేలా కనబడుతుంది. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు అంచనాలను అధిగమించే అవకాశం కలదు.

చిరంజీవి మొదటిసారి ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించిన సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా హీరో రామ్ చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేయడం జరిగింది.

Exit mobile version