భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ‘సైరా’ చిత్రం అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా నైజాం బాక్స్ ఆఫీస్ ముందు మెగాస్టార్ క్రేజ్ ఏపాటిదో నిన్నటితో ఋజువైంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ‘సైరా’ నైజాం మొదటిరోజు కలెక్షన్స్ అల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది.
తొలిరోజు ఈ చిత్రం రూ.8.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ‘సాహో’ రూ.9.41 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ‘బాహుబలి-2’ రూ.8.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక మిగతా ఏరియాల్లో సైతం వసూళ్లు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇంకాసేపట్లో వసూళ్ల పూర్తి వివారాలు తెలిసే అవకాశం ఉంది.బ్బ్
ఇక సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం పట్ల చిరు, రామ్ చరణ్, మొత్తం యూనిట్ సభ్యులు సంతృప్తికరంగా ఉన్నారు.
