భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన ‘సైరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా నైజాం బాక్స్ ఆఫీస్ ముందు మెగాస్టార్ క్రేజ్ ఏపాటిదో మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ తో ఋజువైంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండవ రోజున 10.2 కోట్ల షేర్ ను సాధించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుకుగానూ 47 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే నిన్న వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ కొంతవరకు తగ్గాయి. కానీ రేపటి నుండి మళ్లీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.
