మెగాస్టార్ తరువాత సినిమా మొదలయ్యేది అక్కడే ?

chiru2

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన ‘సైరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక చిరు చిన్న విరామం తరువాత, కొరటాల మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట.

Exit mobile version