తొందరపడి తీవ్రంగా నష్టపోయిన ‘చాణక్య’

Chankaya

గోపిచంద్ నటించిన ‘చాణక్య’ చిత్రం 5వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అంతకు 3 రోజుల ముందే ‘సైరా’ చిత్రం విడుదలై అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ‘చాణక్య’కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు ‘సైరా’ అక్టోబర్ 2న వస్తుందని తెలిసి కూడా ‘చాణక్య’ టీమ్ 5వ తేదీని ఫిక్స్ చేసుకుంది. ఆ డేట్ అనౌన్స్ జరిగిన రోజు నుండే 2న ‘సైరా’ వస్తుంటే 5న విడుదల చేయడం ఎందుకని ట్రేడ్ విశ్లేషకులు, గోపిచంద్ అభిమానులు అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే సినిమా ఎంత బాగున్నా సాధారణ రోజుల్లో వచ్చే ఓపెనింగ్స్ కు, చిరంజీవి సినిమా బ్లాక్ టాక్ తెచ్చుకున్న నాలుగవ రోజునాడు వచ్చే ఓపెనింగ్స్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. అది ‘చాణక్య’ మొదటి రోజు వసూళ్లను చూస్తే అర్థమైపోతుంది. దానికి తోడు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బలహీనంగా ఉండటం ‘సైరా’ హోరు అస్సలు తగ్గకపోవడంతో వసూళ్లు పూర్తిగా క్షీణించిపోయాయి.

6 రోజులకుగాను ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ.3.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా షేర్ రూ.3.9 కోట్లు, గ్రాస్ రూ.6.6 కోట్లు మాత్రమే వసూలైంది. చిత్ర ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం బ్రేక్ ఈవెన్ అమౌంట్ రూ.12 కోట్లని తెలుస్తోంది. సో.. డిస్ట్రిబ్యూటర్లకు హెవీ లాసెస్ తప్పేలా లేవు.

Exit mobile version