చిరు ప్రేక్షకుల్ని పలకరిస్తే మంచిదేమో

syeraa4

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ వసూళ్లతో చిత్రం నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి మిగతా ఏరియాల్లో అదే దిశగా సాగుతోంది. కానీ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా ఉండటంతో బ్రేక్ ఈవెన్ మీద ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ సాధిస్తేనే బయ్యర్లు మంచి లాభాల్ని చూస్తారు.

అలా జరగాలంటే సినిమా రన్ నిలకడగా ఉండాలి. కొత్త సినిమాలు విడుదలకావడంతో థియేటర్ల సంఖ్య తగ్గించారు. సెలవులు కూడా ఏమీ లేవు. కాబట్టి వసూళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిస్తితిని చిత్రం అధిగమించాలంటే ఏకైక మార్గం చిరు రంగంలోకి దిగడమే. థియేటర్ కవరేజ్, విజయోత్సవ వేడుకలు లాంటివి ప్లాన్ చేస్తే ప్రేక్షకుల్లో బజ్ మరింత పెరిగి థియేటర్లకి జనాల తాకిడి పెరుగుతుంది.

అప్పుడే సినిమాను నమ్ముకున్నవారు మంచి లాభాల్ని చూడగలుగుతారు. మరి మెగా కాంపౌండ్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version