ఓ వ్యాపార ప్రకటన కోసం మహేష్ బాబు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆహ్లాదకరమైన వీడియో చేశారు. ఇంటిలో భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతున్న మధుర క్షణాలన బంధించినట్లున్న ఆ వీడియో మహేష్ ఫ్యాన్స్ ని కట్టిపడేసేలా ఉంది. మహేష్ కి తోడుగా నమ్రత,గౌతమ్,సితారల రిచ్ గెటప్స్ లో రాయల్ లుక్ అదిరిపోయింది. రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవెలపర్స్ కొరకు మహేష్ కుటుంబం ఈ యాడ్ లో నటించారు.
సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే పలు బ్రాండ్స్ కి ప్రకటన కర్తగా ఉన్నారు. కాగా మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకరలతో పాటుగా మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.
It's a first for us ❤Had a great time on this one !! Thank you team Sai Surya Developers for making this happen!!https://t.co/lnIsOH5O0o
— Mahesh Babu (@urstrulyMahesh) October 24, 2019