శ్రీ లక్ష్మీ వృషద్దరి ప్రొడక్షన్స్, గీత ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ లో రాధికా కుమార స్వామి ప్రధాన పాత్ర లో రూపొందిన చిత్రం ” సంహారిణి “. 1980లలో ఒక రాజు కుటుంబంలో జరిగే సంఘటనలు ప్రస్తుత కాలంలో వాటితో సంబంధం ఉన్న వ్యక్తుల పట్ల ఎలాంటి ప్రభావం చూపాయి అనే పాయింట్ ప్రధానంగా మూవీ తెరకెక్కిందని సమాచారం. హారర్, కామెడీ. థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహించారు. రాజు కుమార్తె దమయంతి పాత్రలో రాధికా కుమారస్వామి నటించాడు. ఈ చిత్రాన్ని బెంగళూర్, మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది.
ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడు అద్భుతమైన భారీ సెట్స్ వేసారు. విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ తో ఈ చిత్రం ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. చిత్రం విడుదల ముందు ఆడియో విడుదల చెయ్యనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. భజరంగి లోకి, సాధు కోకిల, తబల నాని, మిత్ర ఇతర పాత్రలలో నటిస్తుండగా ఆర్ ఎస్ గణేష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
