దేవరకొండ మూవీ హిందీ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

విజయ్ దేవరకొండ నటించిన కామెడీ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ టాక్సీవాలా హిట్ మూవీగా నిలిచింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు సాధించింది. జిఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా ప్రియాంక జవాల్కర్ విజయ్ సరసన లీడ్ పెయిర్ గా నటించింది. కాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్ కె ఎన్ స్పందించారు.

ఆయన టాక్సీవాలా మూవీ హిందీ రీమేక్ విషయం పై స్పష్టత ఇచ్చారు. టాక్సీవాలా హిందీ రీమేక్ హక్కులు ఎవరికీ ఇంకా ఇవ్వలేదన్న ఆయన ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని ఖండించారు. దీనితో గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు అన్నీ పుకార్లే అని తెలిసిపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నిర్మాతగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1న విడుదల అవుతుంది.

Exit mobile version