‘కొరటాల శివ’ నుండి ఇంట్రస్టింగ్ వీడియో !

Koratala Siva

సామాజిక అంశాల మీద సినిమాలు తీస్తూ… ప్రజలకు మేలు చేసే మంచి భావజాలాన్ని.. సమాజానికి అవసరమైన ఆలోచనలను తన సినిమాల్లో చెప్తూ చూపిస్తూ వరుస హిట్లు కొడుతోన్న కొరటాల శివ… మంచి పనులను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా నిజజీవితంలోనూ పాటిస్తున్నారు. హైదరాబాద్ లో నీటి సమస్య ఎంత అధికమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బాగానే వర్షం పడుతున్నా.. చాల చోట్ల అధికభాగం నీరు వృథా అవుతోంది. దీనికి తోడు నీటి వినియోగం పెరగటంవల్ల నీటి వనరుల కొరత ఏర్పడుతున్నది.

కాగా నీటి సంరక్షణ పై అవహగాన కల్పించడానికి కొరటాల శివ వర్షపు నీటిని తన అఫీస్ లో ఎలా సంరక్షిస్తున్నారో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొరటాల శివ పోస్ట్ చేస్తూ… ‘మా కార్యాలయంలో వర్షపు నీటిని సాధ్యమైనంత ఉత్తమంగా ఆదా చేయడానికి మేం చేసిన ప్రయత్నం ఇది. ప్రతి వర్షపు చుక్కని నిల్వ చేసి ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు’ అని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version