‘ఆపరేష్ గోల్డ్ ఫిష్’.. బ్రేక్ ఈవెన్ బహుదూరం

Operation Gold Fish review

గత వారం విడుదలైన చిత్రాల్లో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా ఒకటి. మొదటిరోజే అంతంతమాత్రమే అనే టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వారంతంలో కూడా కోలుకోలేకపోయింది. ఇక సోమవారం నుండైతే పరిస్థితి మరీ క్షీణించింది. డే బై డే వసూళ్లలో హెవీ డ్రాప్ కనబడింది. ఫలితంగా చిత్రం బ్రేక్ ఈవెన్ కు బహుదూరం అన్నట్టు చతికిలపడింది.

మొదటి ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో రూ.60 లక్షలు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.72 లక్షలకు మాత్రమే పరిమితమైంది. సో..ఐదు రోజుల్లో కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది. మరోవైపు బ్రేక్ ఈవెన్ అమౌంట్ చూస్తే రూ.4 కోట్ల వరకు ఉందట. చాలా చోట్ల సినిమాని ఓన్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ప్రస్తుత పరిస్థితిని, రాబోయే కొత్త సినిమాల్ని బట్టి చిత్రం భారీ నష్టాలతో ఈ శుక్రవారానికి నిష్క్రమించేలా కనబడుతోంది.

Exit mobile version