బిగ్ బాస్ చివరి దశకు చేరడంతో ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. గత ఎపిసోడ్స్ కి మించిన రేటింగ్స్ ప్రస్తుతం బిగ్ బాస్ షో దక్కించుకుంటుంది. ఐతే ఇలాంటి పీక్ టైంలో షో టైమింగ్స్ మార్చి అందరికీ ఝలక్ ఇచ్చారు నిర్వాహకులు. బిగ్ బాస్ షో ని ఒక అరగంట వెనక్కి నెట్టారు. రెగ్యులర్ గా బిగ్ బాస్ ప్రతిరోజు రాత్రి 9:30 గంటల నుండి 10:30 వరకు ప్రసారం అవుతుంది. ఆది మరియు శనివారాలు మాత్రం 9:00 నుండి 10:00 వరకు వచ్చేది.
కాగా ఇప్పుడు 9:30 గంటలకు ప్రసారం కావాల్సిన బిగ్ బాస్ షో 10:00 గంటలకు మొదలై 11:00 గంటలకు ముగుస్తుంది. ఐతే ఆది, శనివారాలలో ఎప్పటిలాగే 9 టు 10 ప్రసారం అవుతుంది. మరి ఈ షెడ్యూలు మార్పులు బిగ్ బాస్ షో పై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి అనడంలో సందేహం లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఆరుగురు సభ్యులలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా, శివజ్యోతి ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదని సమాచారం.
