తలపతి విజయ్, నయనతార జంటగా యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామా విజిల్ మూవీ తెలుగులో మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టిందని టాక్. ప్లేయర్ గా, కోచ్ గా, మధ్య వయస్కుడిగా మూడు విభిన్న గెటప్స్ లో కనిపించిన విజయ్ చిత్రం విజిల్ తెలుగులో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలంగాణాలో విజిల్ చిత్రం మొదటిరోజు 64లక్షల షేర్ సాధించింది. గతంలో విడుదలైన విజయ్ చిత్రాలతో పోల్చుకుంటే ఇది హైయెస్ట్ నైజాం షేర్ అని సమాచారం.
ఇక నేడు రేపు వీకెండ్ కావడంతో పాటు,దీపావళి పండుగ కూడా అవడంతో విజిల్ వసూళ్ళు ఇంకా పెరిగే అవకాశం కలదు. మరో తమిళ డబ్బింగ్ మూవీ ఖైదీ మినహా, తెలుగులో అసలు పోటీ ఇచ్చే చిత్రాలే లేకపోవడంతో విజిల్ మూవీ మెరుగైన వసూళ్లు సాధిస్తుందనిపిస్తుంది. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జంటగా నయనతార నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
