‘అల వైకుంఠపురములో’ టీమ్ ఏ లక్ష్యంతో అయితే మూడు నెలల ముందుగానే పాటల్ని విడుదల చేయడం మొదలుపెట్టారో ఆ లక్ష్యాన్ని చేరుకున్నారనే చెప్పొచ్చు. మొదటి పాట ‘సామజవరగమన’ శ్రోతల్ని గత నెల రోజులుగా ఒక ఊపు ఊపుతుండగా తాజాగా మరొక సాంగ్ ‘రాములో రాముల’ కూడా విడుదలై హడావిడిని మరింత పెంచింది.
‘సామజవరగమన’ క్లాస్ సాంగ్ అయితే ‘రాములో రాముల’ పక్కా మాస్ పార్టీ సాంగ్. అందుకే చాలా త్వరగా జనానికి కనెక్ట్ అయిపోయింది. ఏ సామాజిక మాధ్యమంలో చూసిన ఈ పాటే వినిపిస్తోంది. పాటలో సంగీతంతో పాటు బన్నీ డ్యాన్స్ అద్బుతంగా కుదరడంతో 24 గంటల్లోనే 8.3 మిలియన్ వ్యూస్ సాధించి ఒక రోజులో అత్యధిక వ్యూస్ రాబట్టిన దక్షిణాది పాటగా రికార్డ్ సృష్టించింది.
చూడబోతే ఈ పాట ‘సామజవరగమన’ 50 మిలియన్ల రికార్డును తక్కువ రోజుల్లోనే బీట్ చేసేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రెండు పాటలతోనే సినిమా మీద హైప్ రెట్టింపు అవడమే కాక నమ్మకం కూడా పెరిగింది. సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందనే ఇందుకు సాక్ష్యం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.
