‘ఖైదీ’ వసూళ్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Khaidi review

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సెలవులను తమిళ సినిమాలు పూర్తిగా క్యాష్ చేసుకున్నాయి. ఒకవైపు విజయ్ యొక్క ‘విజిల్’ చిత్రం మంచి వసూళ్లను రాబడితే ఇంకోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి నటించిన ‘ఖైదీ’ చిత్రం సత్తా చాటింది. మొదటి మూడు రోజుల్లో ప్రతి రోజు రెట్టింపు వసూళ్లను రాబట్టుకుంది. మొదటి రోజు రూ. 30 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్ పూర్తి పాజిటివ్ తరహాలో ఉండటంతో రెండో రోజు శనివారం పుంజుకుని రూ.90 లక్షలు ఖాతాలో వేసుకుంది.

ఇక మూడవ రోజు మొదటి రెండు రోజుల కలెక్షన్ల మొత్తానికంటే ఎక్కువే వసూలు చేసింది. ట్రేడ్ ఇన్ఫర్మేషన్ మేరకు ఆదివారం రూ.1.30 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో మూడు రోజులకు కలిపి రూ.2.5 కోట్ల షేర్ వసూలైంది. ఈ వారం కూడా రన్ స్టడీగానే కొనసాగితే తెలుగు పంపిణీదారులు మంచి లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది. గత వారం తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోవడం కూడా ‘ఖైదీ’కి బాగా కలిసొచ్చే విషయం.

Exit mobile version