దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఎట్టకేలకు రామ్ చరణ్ చాల రోజుల తరువాత ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఈ రోజు ఎన్టీఆర్ – చరణ్ ల పై రాజమౌళి కొన్ని క్రేజీ సీన్స్ ను తీస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.
జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
