గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్ లో ప్రభాసే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కాగా తాజాగా ప్రభాస్ ని ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని కామెంట్స్ చేసింది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ విధంగా స్పదించింది.
మంచు లక్ష్మి సరదాగా అడిగిన ఓ ప్రశ్నకు ‘జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లలో ఎవరితో లేచిపోతావు ? ఎవర్ని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు ? అని మంచు లక్ష్మీ ప్రశ్నించగా.. కాజల్ కూడా అంతే సరదాగా స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్‌తో లేచిపోతాను.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను, రామ్‌చరణ్ ను చంపేస్తానని సరదాగా కామెంట్స్ చేసింది. అయితే ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి కారణం.. ఇంకా ప్రభాస్ కి పెళ్లి కాకపోవటమే అని చెప్పుకొచ్చింది కాజల్.
ఇక మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వస్తోన్న ఈ ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ రియాలిటీ షో ని కొంచెం స్పైసీ గానే సాగుతుంది. టాప్ హీరోయిన్స్ కాజల్, సమంత, రకుల్ తో పాటు హీరో వరుణ్ కూడా ఈ షోలో పాల్గొన్నారు.
