సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో కొత్తగా రాబోతున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. తన తండ్రి డ్రీమ్ కోసం అమెరికాకెళ్లే హీరో.. హీరో బాధని అర్ధం చేసుకుని అతనికి సపోర్ట్ గా నిలిచే ప్రయత్నంలో కామెడీని పండించే ఫ్రెండ్స్.. చివరికీ ఏం చేయలేక ఆ ఫ్రెండ్స్ అమెరికాలోనే పార్టీ షురూ చేద్దాం అని హీరోకి సర్దిచెప్తారు. మొత్తానికి టీజర్ సినిమా కాన్సెప్ట్ ని క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేసింది. అలాగే సినిమా పై ఆసక్తిని పెంచింది.
కాగా మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొకుంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కిందట. కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
