‘అసురన్’ రీమేక్‌లో సూపర్ స్టార్ ?

sharku

ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న తమిళ చిత్రాల్లో ధనుష్ నటించిన ‘అసురన్’ కూడా ఒకటి. వెట్రి మారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని కంటెంట్, ధనుష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే కాదు స్టార్ హీరోలను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని చూసిన విక్టరీ వెంకటేష్ వెంటనే తెలుగులోకి రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించనున్నారు.

ఇక ఇటీవలే చిత్రాన్ని చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సైతం చాలా బాగా ఇంప్రెస్ అయ్యారని, చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని బీటౌన్ టాక్. ప్రస్తుతం షారుక్ రెగ్యులర్ కథల్ని కాకుండా సౌత్ నుండి వస్తున్న భిన్నమైన తరహా కథల్ని చేయాలనుకుంటుండటం వలన ఈ వార్తలకు బలం చేకూరింది. ఇకపోతే షారుక్ తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Exit mobile version