అప్పుడే అమ్ముడుపోయిన ‘ప్రెజర్ కుక్కర్’ !

preeser1

మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమాలను కూడా బాగా ఆదరిస్తోన్న రోజులు ఇవి. ఇప్పుడు అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఓ చిన్న సినిమా మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో కొత్తగా రాబోతున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. కాగా తాజాగా ఈ సినిమా ఏపి మరియు తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్ మంచి ఎమౌంట్ కి కొనుగోలు చేసింది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ బాగానే ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచింది. మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొకుంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కిందట. కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version