‘ఖైదీ’ ఐదవ రోజు నైజాం కలెక్షన్స్ !

khaidi2

లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా వచ్చిన ‘ఖైదీ’ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను బాగానే సాధిస్తోంది. ఈ సినిమాకి వర్కింగ్ డేస్ కి కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కాగా నైజాం బాక్సాఫీస్ వద్ద ఖైదీ ఐదవ రోజు సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. గ్రాస్ రూ. 50,15,593 రాగా, నెట్ రూ. 43,21,695 వచ్చింది. అలాగే షేర్ విషయానికి వస్తే.. రూ. 13,71,044 వచ్చింది. కాగా నైజాంలో మొత్తం ‘ఖైదీ’ షేర్ ఇప్పటివరకూ రూ. 1,08,30,903 లుగా ఉంది.

కాగా ఈ వారం కూడా ఖైదీ రన్ స్టడీగానే కొనసాగితే తెలుగు పంపిణీదారులు మంచి లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది. పైగా గత వారం తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోవడం కూడా ‘ఖైదీ’కి బాగా కలిసొచ్చే విషయం. మొత్తం మీద కార్తికి చాల రోజుల తరువాత తెలుగులో ఖైదీ మంచి చిత్రంగా నిలుస్తోంది,

Exit mobile version