బాలకృష్ణ ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Balakrishna

నందమూరి బాలకృష్ణ ఈమధ్య పారితోషకం పెంచారని, ప్రస్తుతం చేస్తున్న ‘రూలర్’ సినిమాకు అధిక మొత్తం ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాతను డిమాండ్ చేస్తున్నారని, ఇది నిర్మాతకు ఇబ్బందిగా మారిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇవి కాస్త పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి.

దీంతో చిత్ర నిర్మాత సి.కల్యాణ్ నేరుగా స్పందించారు. బాలకృష్ణతో గతంలో కూడా పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే విషయంలో కూడా నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి డిస్కషన్ రాలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో కథానాయికలుగా నటిస్తుండగా, డిసెంబర్ 20న చిత్రం విడుదలకానుంది.

Exit mobile version