ప్రస్తుతం పరిశ్రమలో నడుస్తున్న హాట్ టాపిక్ పవన్ రీఎంట్రీ. అభిమానులంతా ఈ అంశం గురించే మాట్లాడుకుంటున్నారు. రోజుకో కొత్త వార్త వెలువడుతోంది. ఈ నేపథ్యంలో పవన్ రీఎంట్రీ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తారని, వచ్చే నెల మూడవ వారంలో అఫీషయల్ కన్ఫర్మేషన్ వస్తుందని బలమైన టాక్.
ఇవన్నీ ఒక ఎత్తైతే రీఎంట్రీ ఇస్తున్న పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే చర్చ మరొక ఎత్తు. సాధారణంగానే పవన్ పారితోషకం చాలా ఎక్కువ. అలాంటిది లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి సినిమా మీద క్రేజ్, హైప్ విపరీతంగా ఉంటాయి. సో.. ఆయన పారితోషకం కూడా గతంతో పోలిస్తే రెట్టింపు ఉండే అవకాశం ఉండొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా వ్యయంలో సగం అనుకోవచ్చు.
మరి నెక్స్ట్ నెలలో పవన్ సినిమాను ప్రకటిస్తారా, ఒకవేళ ప్రకటిస్తే దర్శకత్వ భాద్యతలు క్రిష్ చేతిలో పెడతారా, ఇవన్నీ జరిగితే నిర్మాత ఎవరు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
